Skip to main content

Puri Musings: బాధలు ఎదుర్కొన్న వాళ్లే నవ్వగలరు

 

Puri Musings: బాధలు ఎదుర్కొన్న వాళ్లే నవ్వగలరు :


                                           
Puri Musings: బాధలు ఎదుర్కొన్న వాళ్లే నవ్వగలరు



ఒక వ్యక్తి నవ్వులో స్వచ్ఛత ఉందంటే.. అతడు జీవితంలో నిజంగానే కష్టాలు ఎదుర్కొన్నాడని అర్థమని పూరీ జగన్నాథ్‌ అన్నారు. తాజాగా ఆయన ‘పూరీ మ్యూజింగ్స్‌’ వేదికగా ‘సఫరింగ్‌’ గురించి ఎన్నో గొప్ప విషయాలు తెలిపారు. జీవితమన్నాక ప్రతి ఒక్కరూ కష్టాలు ఎదుర్కొంటారని.. కష్టాల్లేని వ్యక్తి ఈ భూమ్మీద ఉండరని అన్నారు. ఎలాంటి బాధ వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని.. దాని నుంచి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవాలని తెలిపారు. అంతేకాకుండా గతాన్ని తలుచుకుని ఏడ్చేవాళ్లు ఎంతోమంది ఉన్నారని.. వారిని చూస్తే ఇంకా బుర్ర ఎదగలేదని అర్థమవుతుందన్నారు.

‘మనందరికీ బాధ, కష్టం అంటే భయం. జీవితంలో బాధపడకూడదని కోరుకుంటాం. కానీ, మనం ఎంత కోరుకున్నా కుదరదు. ఎందుకంటే జీవితమన్నాక ఎప్పుడో ఒకసారి బాధపడాల్సిందే. పుట్టిన వెంటనే బాధతో ఏడుస్తూనే ఊపిరిపీలుస్తాం. చివర్లో ఊపిరి వదిలేయడానికి కూడా బాధపడతాం. కాబట్టి బాధను అంగీకరించండి. ఆ అనుభవాన్ని పొందండి. కష్టాలు పడండి, కన్నీళ్లు రాలనివ్వండి. రక్తం కారనివ్వండి. జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, బాధల వల్లే మెదడు మరింత దృఢంగా మారుతుంది. గతాన్ని తలుచుకుని ఇంకా ఏడుస్తున్నారంటే మీకు ఇంకా బుద్ధి రాలేదని అర్థం. గతంలో ఎదురైన కష్టాలు గుర్తుకు వస్తే..  నవ్వు రావాలి. అంతేకానీ ఏడుపు కాదు. బాధ పడకుండా.. కష్టాలు ఎదుర్కోకుండా ఎవ్వరూ చావరు. కష్టాల వల్ల మనలో ఒక గ్రేస్‌ వస్తుంది. కళ్లల్లో ఒక మెరుపు ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తి పగలపడి నవ్వినా ఎవరూ పట్టించుకోరు. కానీ, యుద్ధంలో పోరాడి వచ్చిన వ్యక్తి ముఖంపై ఉండే చిన్న చిరు నవ్వు కూడా ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తుంది. ఆ చిరునవ్వు ఎంతకాలమైనా గుర్తుండిపోతుంది. ఎదుటివ్యక్తి నవ్వులో లోతైన ఆనందం ఉంటే.. దాని అర్థం అతను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడని’ అని పూరీ వివరించారు.

Comments

Popular posts from this blog

కొత్త సినిమాలు పార్ట్ -1 - 2021 తెలుగు

కొత్త సినిమాలు  - 2021 తెలుగు  సెకండ్ లాక్ డౌన్ పూర్తిఅయిది. మల్లి  సినిమా హాల్స్ తెరుచుకుంటున్నాయీ .ఇపుడు ఏ సినిమాలు విడుదల తయారయ్యావ్ చూదాం రారోడాయి .  లవ్ స్టోరీ :    నాగచైతన్యు , సాయి పల్లవి  జతగా నటిసున సినిమా . దీనిని శేఖర్ కమల గారు డైరెక్షను చేశారు . సినిమా షూరింగ్ పూర్తి చేసుకొని విడుదలకి రెడీగా ఉదండీ. బహుశా ఏ ఆగెస్ట్ లో విడుదలకావచ్చు .  ఎస్ఆర్ కల్యాణమండపం :   కిరణ్ అబ్బవరం మరియు  ప్రియాంక జవాల్కర్ కలిసి నటిచిన సినిమా .  శ్రీధర్ గాదె డైరెక్షన్స్ లో వస్తున్న సినిమా . సాయి కుమార్ గారు కీలక పాత్ర లో నటిసున్నాడు .ఇప్పటికి విడుదలైన పాటలు మంచి హిట్ అయ్యాయి . ఈ  సినిమా జులైలో విడుదల కావొచ్చు...  వరుడు కావాలను :       నాగ షూర్య  మరియు  రీతూ వర్మ కలిసి నటిచింన  సినిమా .  దీనిని లక్ష్మి సౌజన్య  డైరెక్ట్ చేసున్నారు . ఇప్పటికి  షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి రడ్డిగా ఉదండీ . పుష్ప :     సుకుమార్ మరియు అల్లు అర్జున్ కలియకలో వస్తున్న 3 సినిమా . దీని...

nature wallpapers and background videos

nature wallpapers  background edit videos :

Rashmi Gautam images in jabardasth

 Rashmi Gautam  latest images in  jabardasth and Dhee 13 Rashmi Gautam images in jabardasth