శ్రీ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా రాష్ట్రపతి అయిన తర్వాత ఒకరోజు (వారి సురక్ష బలంతో కలిసి ) వారి అంగరక్షకులతో కలిసి హోటల్ కు భోజనంకు వెళ్తారు. అందరు కూడా వారికి ఇష్టమైన పదార్థాలను ఆర్డర్ ఇచ్చి వాటి రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నారు.
నీతి కథలు - 1 |
అదే సమయంలో మండేలా గారి సీటుకు ముందు ఉన్న సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి భోజనం రాకకై ఎదురు చూస్తున్నారు. మండేలా తన అంగరక్షకులతో చెప్పి ఆ వ్యక్తిని కూడా వారి టేబుల్ దగ్గరికి పిలిపించుకున్నాడు. తర్వాత భోజనం వచ్చింది, అందరూ భోజనం చేస్తున్నారు. ఆ వ్యక్తి భోజనం చేస్తున్నాడు కానీ చేతులు వణుకుతున్నాయి. భోజనం పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి తల కిందకి పెట్టుకొని హోటల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత మండేలా గారితో వారి అంగరక్షక అధికారి ఆ వ్యక్తి అనారోగ్యంతో వణుకుతున్నాడు అని
చెప్పారు. అప్పుడు మండేలా గారు అది కాదు నేను జైల్లో ఉన్నప్పుడు పని చేసిన జైలు అధికారి అతను..... నన్ను రోజంతా నానా రకాలుగా హింసించేవారు. ఆ బాధలు భరించలేక దాహం వేసి నీళ్ళు అడిగితే ఇతడు నాపై మూత్రం పోసేవాడు.
ఇప్పుడు నేను రాష్ట్రపతిని అయ్యాను. నేను కూడా అతని లాగానే వ్యవహరిస్తనేమోనని ప్రతీకారము తీర్చుకుంటానేమోనని భయపడినట్లు ఉన్నాడు కానీ నా స్వభావము అది కాదు. “ప్రతీకారం తీర్చుకోవాలనే భావన వినాశనమునకు దారితీస్తుంది. ధైర్యం మరియు సహిష్ణుత కలిగిన మానసిక స్థితి వికాసానికి దారితీస్తుంది.”
Comments
Post a Comment